అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందవద్దని సీఎం కేసీఆర్ అన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా గింజలేకుంటా సేకరిస్తామని తెలంగాణ రైతు కుటుంబాలకు భరోసానిచ్చారు.

అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన చెందవద్దని సీఎం కేసీఆర్(CM KCR) అన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా గింజలేకుంటా సేకరిస్తామని తెలంగాణ రైతు కుటుంబాలకు భరోసానిచ్చారు. యాసంగి వరి ధాన్యం కొనుగోల్లు జరుగుతున్న తీరు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన వరిధాన్యం సేకరణ, భవిష్యత్తులో యాసంగి వరి ముందస్తుగా కోతలకు వచ్చేలా చర్యలు, ఇందుకు వ్యవసాయశాఖ అనుసరించాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం(BR Ambedkar Telangana Secretariat)లో సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం(High Level Review Meeting) నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. మామూలు వరిధాన్యానికి చెల్లించిన ధరనే.. తడిసిన ధాన్యానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని కాపాడుతూ రైతుల కష్టాల్లో భాగస్వామ్యం పంచుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం(Cheif Minister) పునరుద్ఘాటించారు. గతానికి భిన్నంగా అకాల వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చి నెలలోపే జరిగే విధంగా ఎటువంటి విధానాలను అవలంబించాలో అధ్యయనం చేయాలని, ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని సీఎం వ్యవసాయ శాఖ(Agriculture Department)ను ఆదేశించారు. అకాల వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వరికోతలను మరో మూడు నాలుగు రోజులు వాయిదా వేసుకోవడం మంచిదని రైతులకు సీఎం సూచించారు.

Updated On 2 May 2023 10:41 PM GMT
Yagnik

Yagnik

Next Story