KCR Praja Ashirwada Sabha : ధర్మపురిలో ఇవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ
ధర్మపురి నియోజకవర్గ(Dharmapuri constituency) కేంద్రంలో ఇవాళ సాయంత్రం బీఆర్‌ఎస్(BRS) పార్టీ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు(Praja Ashirwada Sabha) ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు..

KCR Praja Ashirwada Sabha
ధర్మపురి నియోజకవర్గ(Dharmapuri constituency) కేంద్రంలో ఇవాళ సాయంత్రం బీఆర్‌ఎస్(BRS) పార్టీ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు(Praja Ashirwada Sabha) ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు.. నియోజక వర్గంలోని ఏడు మండలాల నుంచి దాదాపు 50 వేల మందికి పైగా సభకు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. సభకు వచ్చే బీఆర్‌ఎస్ శ్రేణులకు ఇక్కట్లు కలగకుండా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభా(Public Meeting) వేదిక ఏర్పాట్లను మూడు రోజులుగా మంత్రి కొప్పుల ఈశ్వర్ దగ్గర ఉండి పర్యవేక్షస్తున్నారు. సభకు వచ్చే ప్రజా నీకానికి ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
