తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ముగింపు రోజైన జూన్ 22న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘తెలంగాణ అమరవీరుల స్మారకం’ ను ప్రారంభించారు. అమరవీరుల స్మారకం భవనంలోకి ప్రవేశించిన సీఎంకు పోలీసుల గౌరవ వందనం సమర్పించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను(Decade celebrations of Telangana state) ముగింపు రోజైన జూన్ 22న ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) ‘తెలంగాణ అమరవీరుల స్మారకం’(Telangana Martyrs Memorial) ను ప్రారంభించారు. అమరవీరుల స్మారకం భవనంలోకి ప్రవేశించిన సీఎం(CM)కు పోలీసుల గౌరవ వందనం సమర్పించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి తెలంగాణ అమరవీరులకు(Telangana Martyrs) నివాళి అర్పించారు. ఆ తర్వాత సీఎం, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అమరులకు నివాళలర్పించారు. అనంత‌రం తెలంగాణ అమరవీరుల స్మారక భవన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మినీ థియేటర్(Mini Theatre) లో అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ రాష్ట్ర సాధనా క్రమాన్ని పొందుపరుస్తూ రూపొందించిన డాక్యుమెంటరీని వీక్షించారు. ఈ సందర్భంగా సీఎం భావోద్వేగానికి లోనయ్యారు. ప్రదర్శన అనంతరం సీఎంతెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతిని స్విచ్ ఆన్ చేసి ప్రజ్వలన చేశారు.

అనంతరం అమరవీరుల స్మారక భవనం నుండి సభా వేదిక వద్దకు సీఎం చేరుకున్నారు. గాయకుడు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్(Deshpathi Srinivas) అమరుల నివాళి గీతం ఆలపిస్తుండగా, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కొవ్వొత్తుల వెలుగుల‌(Candle Light)తో అమరవీరులకు నివాళుల‌ర్పించారు. సీఎంతో పాటు సభా వేదికకు భారీ సంఖ్యలో చేరుకున్న ప్రజలు వెలుగుతున్న కొవ్వొత్తులను ప్ర‌ద‌ర్శిస్తూ అమ‌రుల‌కు నివాళుల‌ర్పించారు. అనంత‌రం అమ‌ర‌వీరుల కుటుంబాల‌ను(Martyrs Family) సీఎం స‌త్క‌రించారు.

అనంతరం సభను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తూ.. తెలంగాణ సాధన కోసం తొలి దశ ఉద్యమాలు ఎట్లా ముందుకు సాగాయో వివరించారు.. ఒక రక్తపు బొట్టు కూడా చిందకుండా తెలంగాణ సాధించాలనే తన ఆశయం కొనసాగిన తీరు, అనూహ్యమైన రీతిలో ముందుకు వచ్చిన ఆత్మహత్యలు.. తెలంగాణ యువతి, యువకుల బలిదానాలు తనను ఎంతగానో కలిచి వేశాయని గద్గద స్వరంతో తన ఆవేదనను పంచుకున్నారు. మూడు వారాలుగా కొనసాగుతున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఒకవైపు సంతోషాన్ని నింపగా.. అమరుల త్యాగాలు వెంటాడుతూ దుఃఖాన్ని కలిగించే సందర్భంలో ఉన్నామని, తెలంగాణ కోసం పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన బిడ్డల స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నామని, పదేళ్లకు చేరుకున్న తెలంగాణ అభివృద్ధిలో వారి త్యాగాల స్ఫూర్తి ప్రతిబింబిస్తున్నదని సీఎం స్పష్టం చేశారు.

Updated On 22 Jun 2023 8:15 PM GMT
Yagnik

Yagnik

Next Story