తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రాజశ్యామల యాగం చేపట్టారు. ఎర్రవల్లి(Erravalli)లోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వేదికగా మూడు రోజులపాటు యాగం జరుగనుంది. యాగాన్ని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర పర్యవేక్షిస్తున్నారు. స్వరూపానందేంద్ర మాట్లాడుతూ..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రాజశ్యామల యాగం చేపట్టారు. ఎర్రవల్లి(Erravalli)లోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వేదికగా మూడు రోజులపాటు యాగం జరుగనుంది. యాగాన్ని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర పర్యవేక్షిస్తున్నారు. స్వరూపానందేంద్ర మాట్లాడుతూ.. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి కోసమే కేసీఆర్ యాగం చేపట్టారని.. రాజశ్యామల యాగం(Raja Shyamala Chandhi Yagam) మహాశక్తివంతమైనదని తెలిపారు.
రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలనే కేసీఆర్ రాజశ్యామల యాగం చేపట్టారని అన్నారు. రాజులతో పాటు సామాన్యులను అనుగ్రహించే అమ్మవారు రాజశ్యామల అమ్మవారని వివరించారు. రాజశ్యామల అమ్మవారు కొలువైన ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదాపీఠం అని తెలిపారు. హైదరాబాద్ మహానగరంగా వెలుగొందుతోందంటే అది గతంలో చేసిన యాగ ఫలితమేనన్నారు.
మహాభారతం చదివిన జ్ఞాని కేసీఆర్ అని స్వరూపానందేంద్ర కొనియాడారు. హైందవ తత్త్వం పరిపూర్ణంగా తెలిసిన నేత కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి రాజశ్యామల అనుగ్రహం ఉండాలని అభిలషించారు.