సీఎం కేసీఆర్ ఏ నిర్మాణం చేప‌ట్టినా భారీగా ఉంటుంది. ఇప్ప‌టికే కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌, స‌చివాల‌యం నిర్మాణం, అంబేద్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటు.. ఇలా ప‌లు విష‌యాల‌ల్లో అది నిరూపిత‌మైంది. తాజాగా మ‌రో భారీ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు సీఎం కేసీఆర్‌. అదే నిమ్స్ ఆసుప‌త్రి విస్తరణ. ఇందుకు ఏకంగా ఎనిమిది అంతస్తుల భ‌వ‌నాన్ని నిర్మించేందుకు సిద్ధ‌మ‌య్యారు కేసీఆర్‌. ఇందుకు సంబంధంచి ఆరోగ్య‌శాఖ‌ మంత్రి హరీశ్‌ రావు మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ సచివాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

సీఎం కేసీఆర్ ఏ నిర్మాణం చేప‌ట్టినా భారీగా ఉంటుంది. ఇప్ప‌టికే కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌(Kaleshwaram Project), స‌చివాల‌యం నిర్మాణం(Telangana Secretariat), అంబేద్క‌ర్ విగ్ర‌హం (Ambedkar Statue) ఏర్పాటు.. ఇలా ప‌లు విష‌యాల‌ల్లో అది నిరూపిత‌మైంది. తాజాగా మ‌రో భారీ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు సీఎం కేసీఆర్‌. అదే నిమ్స్ ఆసుప‌త్రి(Nims Hospital) విస్తరణ. ఇందుకు ఏకంగా ఎనిమిది అంతస్తుల భ‌వ‌నాన్ని నిర్మించేందుకు సిద్ధ‌మ‌య్యారు కేసీఆర్‌(KCR). ఇందుకు సంబంధంచి ఆరోగ్య‌శాఖ‌ మంత్రి హరీశ్‌ రావు(Harish Rao) మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్క‌ర్ సచివాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమ్స్ ద‌వాఖానా విస్త‌ర‌ణ‌లో భాగంగా నిర్మించబోతున్న 2 వేల పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్‌ భూమిపూజ(Lay Foundation Stone) చేస్తారని వెల్లడించారు. ఈ మేరకు త్వరగా అన్ని ఏర్పాట్లు చేయాలని, అవసరమైన అన్ని విభాగాల అనుమతులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

నూతన భవనంలో ఓపీ(OP), ఐపీ(IP), ఎమర్జెన్సీ సేవల(Emergency Services)కు ప్రత్యేకంగా బ్లాకులు ఉంటాయన్నారు. భవనం మొత్తం ఎనిమిది అంతస్తులుగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం నిమ్స్‌లో 1500 పడకలు ఉన్నాయని, నూతన భవనం పూర్తయితే పడకల సంఖ్య 3,500కు చేరుతుందన్నారు. ఇటీవల భూమిపూజ చేసుకున్న సూపర్‌ స్పెషాలిటీ ఎంసీహెచ్‌(Super Speciality MCH)) కూడా పూర్తయితే.. మరో 200 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తద్వారా ఒక నిమ్స్‌లోనే 3,700 పడకలు ఉంటాయని చెప్పారు. నిమ్స్‌ ఎంసీహెచ్‌ పనులు వేగవంతం చేయాలన్నారు. పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ నలువైపులా ఒక్కొక్కటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్‌ దవాఖానలతోపాటు నిమ్స్‌ విస్తరణకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు.

Updated On 2 May 2023 11:40 PM GMT
Yagnik

Yagnik

Next Story