బీఆర్‌ఎస్(BRS) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఎందుకు ఆయన రెండు చోట్ల బరిలో దిగుతున్నారనే చర్చ మొదలయ్యింది. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడమన్నది ఇదేం మొదటిసారి కాదు. 2004లో ఆయన సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, కరీంనగర్ లోక్‌సభ నుంచి పోటీ చేశారు. రెండు చోట్లా విజయం సాధించారు. సిద్ధిపేటను వదులుకున్నారు. 2014 ఎన్నికల్లో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, మెదక్ లోక్‌సభ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కూడా రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. కానీ ఈ రెండూ అసెంబ్లీ స్థానాలు కావడం గమనార్హం. ఎందుకు రెండు ఎమ్మెల్యే స్థానాలకు కేసీఆర్ పోటీ చేస్తున్నారు? నిజానికి ఆయన కామారెడ్డి(Kamareddi) నుంచి పోటీ చేస్తారనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. నెల రోజుల కిందట మా వెబ్‌సైట్ కూడా ఈ విషయాన్ని చెప్పింది. అప్పుడు అందరూ గజ్వేల్‌ను వదిలిపెట్టి కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని విపక్షాలు అంటున్నాయి. గెలుపుపై నమ్మకం లేదు కాబట్టే రెండు చోట్ల బరిలో దిగుతున్నారని వాదిస్తున్నాయి.
బీఆర్‌ఎస్(BRS) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఎందుకు ఆయన రెండు చోట్ల బరిలో దిగుతున్నారనే చర్చ మొదలయ్యింది. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడమన్నది ఇదేం మొదటిసారి కాదు. 2004లో ఆయన సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, కరీంనగర్ లోక్‌సభ నుంచి పోటీ చేశారు. రెండు చోట్లా విజయం సాధించారు. సిద్ధిపేటను వదులుకున్నారు. 2014 ఎన్నికల్లో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, మెదక్ లోక్‌సభ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కూడా రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. కానీ ఈ రెండూ అసెంబ్లీ స్థానాలు కావడం గమనార్హం. ఎందుకు రెండు ఎమ్మెల్యే స్థానాలకు కేసీఆర్ పోటీ చేస్తున్నారు? నిజానికి ఆయన కామారెడ్డి(Kamareddi) నుంచి పోటీ చేస్తారనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. నెల రోజుల కిందట మా వెబ్‌సైట్ కూడా ఈ విషయాన్ని చెప్పింది. అప్పుడు అందరూ గజ్వేల్‌ను వదిలిపెట్టి కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని విపక్షాలు అంటున్నాయి. గెలుపుపై నమ్మకం లేదు కాబట్టే రెండు చోట్ల బరిలో దిగుతున్నారని వాదిస్తున్నాయి. గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు అంత కష్టంగా ఉందా అంటే కాంగ్రెస్(Congress) కూడా ఈ మాటను అంగీకరించదు. కేసీఆర్ గెలుపు అక్కడ నల్లేరు మీద నడకే! గతంలో కాంగ్రెస్ పార్టీకి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి వంటి బలమైన నేత ఉండేవారు. ఇప్పుడు ఆయన బీఆర్‌ఎస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌కు అక్కడ బలమైన నేతలెవ్వరూ లేరు. మరి కేసీఆర్ కామారెడ్డిని ఎందుకు ఎంచుకున్నారు? నిజానికి అక్కడ బీఆర్‌ఎస్ గెలుపు అంత ఈజీ కాదు. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్‌కు కాస్త అనుకూల వాతావరణం ఉందనే చర్చ జరుగుతోంది. అక్కడ్నుంచి గంప గోవర్థన్(Gampa Govardhan) వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం కొంచెం కష్టంగానే ఉందని అంటున్నారు. 2004 తర్వాత అక్కడ్నుంచి గంప గోవర్ధన్ తప్ప మరొకరు గెలవలేదు. ఇప్పుడు కేసీఆర్ బరిలో ఉన్నారు కాబట్టి గెలుపు ఈజీనే! మరి కేసీఆర్ రెండు చోట్లా గెలిస్తే ఏ స్థానాన్ని వదులుకుంటారనే ప్రశ్న మొదలవుతోంది. కేసీఆర్ వదులుకునే స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారు? గజ్వేల్ సీటు ఒంటేరు ప్రతాప్‌రెడ్డికి కేటాయించి, కేసీఆర్ కామారెడ్డికి వెళతారు అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు రెండు చోట్లా కేసీఆర్ గెలిస్తే మాత్రం ఆయన గజ్వేల్‌ను వదులుకుంటారని అర్థమవుతోంది. కేసీఆర్ పూర్వీకులు అందరూ కామారెడ్డిలో ఉంటున్నారు. కేసీఆర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయితే బాగుంటుందని స్థానికులు చాలా సార్లు రిక్వెస్ట్ చేశారు కూడా ! మీ ఊరు నుంచి మీరు పోటీ చేయండి అని కేసీఆర్‌కు విన్నవించుకున్నారు కూడా! మొత్తం మీద గజ్వేల్‌ను కేసీఆర్ వదులకుంటారని తెలుస్తోంది. మరి ఈ స్థానం తర్వాత ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది.