సీఎం కేసీఆర్(CM KCR) సంగారెడ్డి(sangareddy) జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మొద‌ట‌ జిల్లా కేంద్రంలోని రామచంద్రాపురం(Ramachandrapuram) మండలం, కొల్లూరు(Kollur) గ్రామంలో నిర్మితమైన ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం కాలనీని(Double bedroom colony) ఈరోజు ప్రారంభించారు.

సీఎం కేసీఆర్(CM KCR) సంగారెడ్డి(sangareddy) జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మొద‌ట‌ జిల్లా కేంద్రంలోని రామచంద్రాపురం(Ramachandrapuram) మండలం, కొల్లూరు(Kollur) గ్రామంలో నిర్మితమైన ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం కాలనీని(Double bedroom colony) ఈరోజు ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అనంత‌రం రంగారెడ్డి జిల్లా కొండకల్‌ వద్ద రూ.1000కోట్లతో మేధా గ్రూప్‌ నిర్మించిన మేథా గ్రూప్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా టీఎస్‌ ఐపాస్‌ను తీసుకురావ‌డం ద్వారానే అద్భుత‌మైన‌ పారిశ్రామిక ప్రగతి, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పెరుగుతున్నది. నిజంగా ఆనందంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రైలు కోచ్‌లు మ్యానుఫ్యాక్చర్‌ చేస్తారంటే ఊహించలేదని అన్నారు. విడివిడి భాగాలను ఎంత స్కిల్‌తో చేస్తున్నారో కశ్యప్‌రెడ్డి స్వయంగా చూపించారని తెలిపారు. కశ్యప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మేథా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నిజంగా గర్వపడుతున్నామ‌ని కొనియాడారు. ఈ ఫ్యాక్టరీ ఇంకా ముందుకెళ్లాల‌ని అభిలాషించారు.

వరంగల్‌ ముద్దుబిడ్డలైన‌ కశ్యప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి ఈ భారీ ప్రాజెక్టు ద్వారా వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టు చేపట్టడమే కాదు.. పూర్తి రైలును తయారు చేసేందుకు ముంబయి నుంచి మోనో రైలు తయారీకి ఆర్డర్‌ రావడం గొప్ప విషయం. భవిష్యత్‌లో పూర్తిస్థాయిలో రైలు తయారై పోయేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెబుతున్నారు. దేశంతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి స్థాయికి ఎదుగుతున్నామని చెప్పడం అభినందనీయం. ఏ సమస్య వచ్చినా పరిష్కారించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని.. పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం, సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని కేసీఆర్ భ‌రోసా ఇచ్చారు.

కార్య‌క్ర‌మం అనంత‌రం పటాన్‌చెరులో రూ.183కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి నిర్మాణానికి పునాదిరాయి వేశారు.

Updated On 22 Jun 2023 4:06 AM GMT
Ehatv

Ehatv

Next Story