తెలంగాణ(Telangana) సీఎం కేసీఆర్(CM KCR) శుక్రవారం ప్రగతి భవన్(Pragathi Bhavan) నుంచి వర్చువల్(Virtual) విధానంలో 9 మెడికల్ కాలేజీలను(Medical Colleges) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు.

Medical Colleges In Auguration
తెలంగాణ(Telangana) సీఎం కేసీఆర్(CM KCR) శుక్రవారం ప్రగతి భవన్(Pragathi Bhavan) నుంచి వర్చువల్(Virtual) విధానంలో 9 మెడికల్ కాలేజీలను(Medical Colleges) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరంలో దాదాపు 24 వరకూ చేరుకున్నాం. గతంలో ఐదు మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇవాళ ఆ సంఖ్య 26కు చేరిందని వివరించారు. వచ్చే విద్యా సంవత్సరానికి 8 కాలేజీలు నూతనంగా ప్రాంరంభం కాబోతున్నాయని వెల్లడించారు. ఆ కాలేజీలకు కేబినెట్ ఆమోదం కూడా లభించిందని సీఎం కేసీఆర్ తెలిపారు.
2014లో 2,850 మెడికల్ సీట్లు ఉంటే.. 2023 నాటికి 8,515 మెడికల్ సీట్లు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. ప్రయివేటు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ద్వారా సంవత్సరానికి 10 వేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేయబోతున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, రోగ నిరోధక శక్తి ఉండాలంటే.. తెల్ల రక్త కణాలు ఏ విధంగా పని చేస్తాయో.. తెలంగాణ ఉత్పత్తి చేయబోయే తెల్ల కోట్ డాక్టర్లు రాష్ట్రానికే కాదే.. దేశ ఆరోగ్య వ్యవస్థను కూడా కాపాడుతారని కేసీఆర్ వివరించారు.
