పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పంచభూతాల్లో భాగమైన నీరు, ప్రాణవాయువును కొనుక్కొనే దుస్థితికి మానవాళి చేరడానికి మానవ తప్పిదాలే కారణమన్నారు. ప్రకృతిని మనం కాపాడితే, ప్రకృతి మనల్ని కాపాడుతుందనే సత్యాన్ని మరవరాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నేడు రాష్ట్రంలో పచ్చదనం పెరిగి జీవ వైవిధ్యం పరిఢవిల్లుతున్నదని సీఎం అన్నారు.

సృష్టికి మూలమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకున్నప్పుడే భవిష్యత్ తరాలు సుఖశాంతులతో ఉంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోకాపేటలోని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) లే అవుట్‌ నియోపొలిస్‌లో కేసీఆర్‌ పొన్న మొక్క నాటారు.
పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పంచభూతాల్లో భాగమైన నీరు, ప్రాణవాయువును కొనుక్కొనే దుస్థితికి మానవాళి చేరడానికి మానవ తప్పిదాలే కారణమన్నారు. ప్రకృతిని మనం కాపాడితే, ప్రకృతి మనల్ని కాపాడుతుందనే సత్యాన్ని మరవరాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నేడు రాష్ట్రంలో పచ్చదనం పెరిగి జీవ వైవిధ్యం పరిఢవిల్లుతున్నదని సీఎం అన్నారు. హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో గ్రీన్ కవర్ 7.70 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక వెల్లిడంచడం గొప్ప విషయమన్నారు. ఇది తెలంగాణ ప్రజల పర్యావరణ పరిరక్షణ దీక్షకు దర్పణం పడుతున్నదన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలవడం, బృహత్ ప్రకృతి వనాల పై నీతి ఆయోగ్ ప్రశంసలు, హరితహారం ద్వారా 273 కోట్ల మొక్కలను నాటడం ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నంగా రికార్డులకెక్కడం, ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్’ నివేదికలో పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కడం వంటి విజయాలన్నీ పర్యావరణ పరిక్షణ పట్ల తెలంగాణ ప్రభుత్వానికున్న నిబద్ధతను స్పష్టం చేస్తున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి కే కేశవరావు,మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,. ప్రశాంత్ రెడ్డి,మల్లారెడ్డి,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, హెచ్ఎమ్‌డీఎ అధికారులు పాల్గొన్నారు.

Updated On 5 Jun 2023 6:47 AM GMT
Ehatv

Ehatv

Next Story