డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట మహోన్నతంగా వెలుగులీనేలా, ప్రజల ఆత్మగౌరవం మరింత ఇనుమడింపజేసేలా, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, వినూత్న రీతిలో అత్యద్భుతంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించుకున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇది యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భమని సీఎం కేసీఆర్ అన్నారు.
డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం(BR Ambedkar Telangana Secretariat) ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రతిష్ట మహోన్నతంగా వెలుగులీనేలా, ప్రజల ఆత్మగౌరవం మరింత ఇనుమడింపజేసేలా, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, వినూత్న రీతిలో అత్యద్భుతంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించుకున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(K Chandrashekar Rao) తెలిపారు. ఇది యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భమని సీఎం కేసీఆర్ అన్నారు. అనేక అపోహలు సృష్టించి చేసిన విమర్శలు, అడ్డంకులను దాటుకుంటూ దృఢ సంకల్పంతో ప్రారంభమైన నూతన సచివాలయ నిర్మాణం, అనతికాలంలోనే దేశానికే వన్నె తెచ్చేలా పూర్తయ్యిందన్నారు. ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు.
భవిష్యత్తు తరాల పరిపాలన అవసరాలనూ దృష్టిలో వుంచుకుని సాంకేతిక విలువలతో సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందన్నారు. అన్ని రకాల ప్రమాణాలను పాటిస్తూ, అనేక విశిష్టతలతో నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల మహాద్భుత కట్టడం కొత్త సచివాలయ భవనమని కేసీఆర్ పేర్కొన్నారు. మార్పుకనుగుణంగా ఎప్పటికప్పుడు తమను తాము తీర్చిదిద్దుకుంటూ, ప్రజా ఆకాంక్షలకు అనుకూలంగా మహోన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటూ, వాటిని సాకారం చేసే దిశగా సుపరిపాలన కొనసాగేలా సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందని సీఎం అన్నారు. ఒక రాష్ట్ర సచివాలయానికి డా. బీఆర్. అంబేద్కర్ పేరును పెట్టడం దేశంలోనే మొదటిసారి అని సీఎం తెలిపారు. అంబేద్కర్ మహాశయుని పేరు పెట్టుకోవడం వెనక సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా, పేద వర్గాలకు సమాన హక్కులు దక్కాలనే సమున్నత లక్ష్యమున్నదని సీఎం అన్నారు.
ఇదిలా ఉంటే.. నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి కార్యక్రమాల షెడ్యూల్‌ను విడుదలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. తొలుత ఉదయం 6 గంటలకు సుదర్శన యాగం ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ యాగంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 గంటల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం చేయనున్నారు. ఆ తర్వాత నూతన సచివాలయాల ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతులపై జరుగనున్నది.