సిద్దిపేటలోని ఓ దాబాలో సీఎం కేసీఆర్ టీ తాగారు. అక్కడ నేతలతో కాసేపు సరదాగా గడిపారు. సిద్దిపేటలో నిర్వహించిన ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ ముగించుకొని హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో

CM KCR Had Tea In Dhaba While Going To Hyderabad From Siddipet Along With BRS Leaders
సిద్దిపేట(Siddipeta)లోని ఓ దాబాలో సీఎం కేసీఆర్(CM KCR) టీ(Tea) తాగారు. అక్కడ నేతలతో కాసేపు సరదాగా గడిపారు. సిద్దిపేటలో నిర్వహించిన ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ ముగించుకొని హైదరాబాద్(Hyderabad) తిరుగు ప్రయాణంలో పట్టణ శివారులోని పొన్నాల సోని దాబా(Sony Dhaba)లో టీ తాగారు. సీఎం కేసీఆర్‌తో పాటు.. మంత్రి హరీశ్ రావు(Harish Rao), ఎమ్మెల్సీ మధుసుదనా చారి(Madhusudhana Chary), ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి(MP Kothaprabhakar Reddy), ఎర్రోళ్ల శ్రీనివాస్(Errolla Srinivas) కూడా ఉన్నారు. సామాన్యుడిలా సీఎం కేసీఆర్ దాబాలో టీ తాగటం చూసి.. అందరూ ఆశ్చర్యపోయారు.
ఇదిలావుంటే.. అసెంబ్లీ ఎన్నికలకు మరి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇటీవల అనారోగ్యం కారణంగా దాదాపు 20 రోజులు విశ్రాంతి తీసుకున్న ఆయన.. కోలుకున్న తర్వాత ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. అన్ని పార్టీల కంటే ముందే ఒకేసారి 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ప్రచారంలోనూ అదే దూకుడుతో ముందుకు సాగుతున్నారు.
