బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొద్దిసేప‌టి క్రితం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్‌..

బీఆర్ఎస్(BRS) అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్(CM KCR) కొద్దిసేప‌టి క్రితం నామినేష‌న్(Nomination) దాఖ‌లు చేశారు. గ‌జ్వేల్(Gajwel) అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న కేసీఆర్‌.. త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆర్‌వో కార్యాల‌యం(RO Office)లో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు. సీఎం వెంట‌ ప‌లువురు స్థానిక‌ బీఆర్ఎస్ నాయ‌కులు ఉన్నారు.

అంత‌కుముందు కేసీఆర్ ఎర్ర‌వ‌ల్లి(Erravalli) నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌(Helicopter)లో గ‌జ్వేల్‌కు వెళ్లారు. నామినేష‌న్ దాఖ‌లు చేసిన‌ అనంత‌రం గ‌జ్వేల్ నుంచి హెలికాప్ట‌ర్‌లో కామారెడ్డి(Kamareddy)కి బ‌య‌ల్దేరారు. అక్క‌డ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల లోపు మ‌రో నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. అనంత‌రం అక్క‌డ నిర్వ‌హించే బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగిస్తారు.

Updated On 9 Nov 2023 1:12 AM GMT
Yagnik

Yagnik

Next Story