ప్రగతిభవన్‌లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. విజయదశమి పండుగను సందర్భంగా ప్రగతిభవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసమేతంగా వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శమీపూజ నిర్వహించారు. సంప్రదాయ పద్దతిలో జమ్మి చెట్టుకు పూజలు చేసిన పూజారులు విజయాలు సిద్ధించాలని కేసీఆర్‌కు ఆశీర్వచనం ఇచ్చారు.
ప్రగతిభవన్‌లో (Pragathi Bhavan) దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. విజయదశమి పండుగను సందర్భంగా ప్రగతిభవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (KTR) కుటుంబసమేతంగా వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శమీపూజ నిర్వహించారు. సంప్రదాయ పద్దతిలో జమ్మి చెట్టుకు పూజలు చేసిన పూజారులు విజయాలు సిద్ధించాలని కేసీఆర్‌కు ఆశీర్వచనం ఇచ్చారు. శుభసూచకంగా భావించే పాలపిట్టను కేసీఆర్ (KCR) కుటుంబం దర్శనం చేసుకుంది.సాంప్రదాయం ప్రకారం దసరానాడు ప్రత్యేకంగా నిర్వహించే వాహన పూజలో మనుమడు హిమాన్షును తోడ్కొని ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం సాంప్రదాయ పద్దతిలో వేదపండితులు నిర్వహించిన ఆయుధ పూజలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.