తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) శంఖారావాన్ని పూరించారు. డిసెంబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌(BRS) నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కేసీఆర్‌ ప్రకటించారు. శ్రావణమాసం పంచమి తిథి మంచి రోజు కావడంతో ఇదే శుభ ముహూర్తంగా భావించిన కేసీఆర్‌ అభ్యర్థుల వివరాలను తెలిపారు. కేవలం ఏడు స్థానాల్లోనే అభ్యర్థులను మార్చారు. నాలు స్థానాలను కేసీఆర్‌ పెండింగ్‌లో పెట్టారు. మూడు నెలల ముందే 115 మంది అభ్యర్థులను ప్రకటించడం ఓ రకంగా సాహసమే! అభ్యర్థుల జాబితాను సామాజిక కోణంలో పరిశీలిస్తే బీసీలలోని ప్రధానమైన ముదిరాజ్‌ సామాజికవర్గానికి మొండిచెయ్యి చూపించారనే విషయం అర్థమవుతోంది. ముదిరాజ్‌(Mudiraj) సామాజికవర్గం నుంచి పార్టీలో ఇంతకు ముందు హుజురాబాద్‌ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌(Etela Rajendhar) ఉన్నారు. ఈటల తర్వాత ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో బండ ప్రకాశ్‌ ఉన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) శంఖారావాన్ని పూరించారు. డిసెంబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌(BRS) నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కేసీఆర్‌ ప్రకటించారు. శ్రావణమాసం పంచమి తిథి మంచి రోజు కావడంతో ఇదే శుభ ముహూర్తంగా భావించిన కేసీఆర్‌ అభ్యర్థుల వివరాలను తెలిపారు. కేవలం ఏడు స్థానాల్లోనే అభ్యర్థులను మార్చారు. నాలు స్థానాలను కేసీఆర్‌ పెండింగ్‌లో పెట్టారు. మూడు నెలల ముందే 115 మంది అభ్యర్థులను ప్రకటించడం ఓ రకంగా సాహసమే! అభ్యర్థుల జాబితాను సామాజిక కోణంలో పరిశీలిస్తే బీసీలలోని ప్రధానమైన ముదిరాజ్‌ సామాజికవర్గానికి మొండిచెయ్యి చూపించారనే విషయం అర్థమవుతోంది. ముదిరాజ్‌(Mudiraj) సామాజికవర్గం నుంచి పార్టీలో ఇంతకు ముందు హుజురాబాద్‌ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్‌(Etela Rajendhra) ఉన్నారు. ఈటల తర్వాత ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో బండ ప్రకాశ్‌ ఉన్నారు. ఆయనను గత ఎన్నికలకు ముందు రాజ్యసభకు పంపించారు కేసీఆర్‌. అలా ముదిరాజ్‌ సామాజికవర్గ ఓట్లను రాబట్టుకున్నారు కేసీఆర్‌. అదే సమయంలో యాదవ సామాజికవర్గానికి చెందిన బడుగుల లింగయ్యకు కూడా రాజ్యసభ ఇచ్చారు. ఈ విధంగా యాదవ(Yadav) సామాజికవర్గాన్నికూడా ఆకర్షించారు. రెండు ప్రధానమైన సామాజికవర్గాలకు రాజ్యసభ ఇవ్వడం ద్వారా రాజకీయ లబ్ధి పొందింది బీఆర్‌ఎస్‌ పార్టీ. ఈసారి ప్రకటించిన 115 స్థానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ముదిరాజ్‌లకు కేటాయించలేదు. ఇది సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. తెలంగాణలో ముదిరాజ్‌లు గణనీయంగా ఉన్నారు. ఇలాంటి సామాజికవర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం చేశారని అర్థమవుతోంది. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న నాలుగు స్థానాలలో ఏదైనా ముదిరాజ్‌లకు కేటాయిస్తారా అంటే ఆ అవకాశం కనిపించడం లేదు. ముదిరాజ్‌ కమ్యూనిటీ ఓటింగ్‌ తమకు రాదని బీఆర్‌ఎస్‌ భావిస్తోందా? ఇదే సమయంలో పెరిక సామాజికవర్గానికి కూడా కేసీఆర్‌ మొండిచేయి చూపించారు. వీరి ప్రభావం రెండు మూడు జిల్లాలో ఉంది. ఈ సామాజికవర్గం నుంచి ప్రస్తుతం గంప గోవర్థన్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తున్నారు కాబట్టి గంప గోవర్థన్ బరిలోంచి తప్పుకున్నారు. ఈ రెండు సామాజికవర్గాలకు టికెట్లు కేటాయించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదనే వివరణ బీఆర్‌ఎస్‌ ఇచ్చుకుంటుందా? లేదా అన్నది చూడాలి.

Updated On 21 Aug 2023 7:40 AM GMT
Ehatv

Ehatv

Next Story