నామినేషన్‌(Nomination) వేయడానికి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) సిద్ధిపేట(siddipet) జిల్లా నంగనూరు మండలం కోనాయిపల్లి గ్రామ వేంకటేశ్వరస్వామి(Konaipalli Venkateswara Swamy.) ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ మాటకొస్తే ఏ శుభకార్యం చేసినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే పనులను ప్రారంభిస్తారు.

నామినేషన్‌(Nomination) వేయడానికి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) సిద్ధిపేట(siddipet) జిల్లా నంగనూరు మండలం కోనాయిపల్లి గ్రామ వేంకటేశ్వరస్వామి(Konaipalli Venkateswara Swamy.) ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ మాటకొస్తే ఏ శుభకార్యం చేసినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే పనులను ప్రారంభిస్తారు. ప్రతి ఎన్నికల ముందు నామినేషన్‌ పత్రాలను వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు కేసీఆర్‌. 1985వ సంవత్సరం నుంచి ఇది ఆనవాయితీగా వస్తోంది. 1989, 1994, 1999, 2001, 2004, 2009 ఎన్నికల నామినేషన్‌ పత్రాలకు పూజలు నిర్వహించి, నామినేషన్‌ వేసి విజయం సాధించారు కేసీఆర్‌. ఈ ఎన్నికల్లో గజ్వేల్‌(Gajwel), కామారెడ్డి(Kamareddy) అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న కేసీఆర్‌ తాను దాఖలు చేయనున్న నామినేషన్‌ పత్రాలకు పూజలు చేయడానికి శనివారం ఆలయాన్ని సందర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డుమార్గం ద్వారా గ్రామానికి చేరుకుని వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. నామపత్రాలను స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సీఎం కేసీఆర్‌ ఈ నెల 9వ తేదీన ఉదయం గజ్వేల్‌లో, మధ్యాహ్నం కామారెడ్డిలో నామపత్రాలు దాఖలు చేయనున్నారు. పునర్నిర్మాణం తర్వాత మొదటిసారిగా కేసీఆర్‌ ఆలయాన్ని సందర్శిస్తుండగా.. అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated On 4 Nov 2023 2:38 AM GMT
Ehatv

Ehatv

Next Story