తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా వుంటూ వస్తున్న కేసీఆర్(KCR) కు గుంట భూమి(Land) కూడా లేదట! ఇది నిజం. ఎన్నికల నామిషన్(Nomination) దాఖలు ప్రక్రియలో భాగంగా కేసీఆర్..ఆస్తుల వివరాల్లో ఈ విషయం వెల్లడైంది. గజ్వేల్(Gajwel), కామారెడ్డి(Kamareddy) నుంచి పోటీ చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఇవాళ నామినేషన్లు దాఖలు వేశారు. గురువారం ఉదయం గజ్వేల్‌లో, మధ్యాహ్నం కామారెడ్డిలో నామినేషన్‌ దాఖలు చేశారు. మొదట గజ్వేల్‌లో ఆర్డీవో(RDO) కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు.

అంతకు ముందు తొలుత బీఆర్‌ఎస్‌(BRS) నేతలతో ఆయన చర్చలు జరిపిన అనంతరం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో(affidavit) తన ఆదాయం(Income), సంపద వంటి వివరాలన్నీ వెల్లడించారు. నామినేషన్‌ సమయంలో సమర్పించిన అఫిడవిట్లలో కేసీఆర్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయి. ఇవన్నీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనపై పెట్టినవే. ప్రస్తుతం కేసీఆర్‌ దగ్గర 2 లక్షల 96 వేల రూపాయల నగదు మాత్రమే ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు! కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మ(Shobha) పేర్లపై బ్యాంక్‌లలో 17 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయి.

కేసీఆర్ పేరు మీద మొత్తం తొమ్మిది బ్యాంక్ అకౌంట్స్, శోభమ్మకు మూడు అకౌంట్స్ ఉన్నాయి. గడిచిన అయిదేళ్లలో బ్యాంకు డిపాజిట్లు డబుల్‌ కావడం గమనార్హం.
2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్‌ ప్రకారం బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్‌ కలిపి రూ.5.63 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడవి 11.16 కోట్ల రూపాయలు పెరిగాయి. 2018 ఎన్నికల సమయంలో శోభమ్మ దగ్గర 94 వేల రూపాయలు ఉంటే .. ఇప్పుడు అవి 6.29 కోట్ల రూపాయలు అయ్యాయి. బంగారు ఆభరణాలు 2.8 కిలోలు ఉన్నాయి.

వీటి విలువ 17 లక్షల రూపాయలు ఉంటుంది. పదేళ్లుగా ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేవని అఫిడేవిట్‌లో తెలిపారు కేసీఆర్. స్థిర ఆస్తుల రూపంలో 17.83 కోట్ల రూపాయలు , చరాస్తుల రూపంలో 9.67 కోట్ల రూపాయలు ఉన్నాయి కేసీఆర్‌కు. ఆయన భార్య శోభ పేరు మీద 7.78 కోట్ల రూపాయల విలువ చేసే చరాస్తులు ఉన్నాయి. ఉమ్మడి ఆస్తిగా 9.81 కోట్ల రూపాయల మేర చరాస్తులు ఉన్నాయి. కేసీఆర్‌ పేరు మీద 17.27 కోట్ల రూపాయల అప్పు ఉంది.

కుటుంబం పేరు మీద 7.23 కోట్ల రూపాయలు అప్పు ఉంది. కేసీఆర్‌ సొంతంగా కారు, బైక్‌ లేదు.బదులుగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీ తదితర వాహనాలు 14 ఉన్నాయి. వీటి విలువ 1.16 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ఉన్న భూమంతా కుటుంబ ఉమ్మడి ఆస్తిగా చూపించారు కేసీఆర్‌. కేసీఆర్ కుటుంబానికి 62 ఎకరాల భూమి ఉండగా.. అందులో 53.30 ఎకరాల సాగుభూములు, 9.36 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నాయి.

Updated On 9 Nov 2023 7:44 AM GMT
Ehatv

Ehatv

Next Story