CM KCR Cabinet Meeting : డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ
సీఎం కేసీఆర్(CM KCR) అధ్యక్షతన డిసెంబర్ 4న కేబినేట్ సమావేశం(Cabinet Meeting) జరుగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలొ(Dr.Ambedkar secretariat) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుందని ప్రకటనలో వెల్లడించింది.
సీఎం కేసీఆర్(CM KCR) అధ్యక్షతన డిసెంబర్ 4న కేబినేట్ సమావేశం(Cabinet Meeting) జరుగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలొ(Dr.Ambedkar secretariat) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుందని ప్రకటనలో వెల్లడించింది. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. డిసెంబర్ 4వ తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరుగనుండటంతో.. అసలు ఏం జరుగుతోందని అనే టెన్షన్ అందరిలోనూ ఉంది.
గురువారం తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్(BRS) అన్ని అధికార బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే కేటీఆర్(KTR), కవిత(Kavitha) మాత్రం విజయం బీఆర్ఎస్ దే అంటున్నారు. పోలింగ్ అనంతరం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడతారని భావించగా.. కేబినెట్ భేటీకి పిలుపునివ్వడంతో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.