వైరి పక్షాలు కాంగ్రెస్‌(Congress), బీజేపీలు(BJP) ఇంకా అభ్యర్థుల ఎంపికలో తలమునకలుగా ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌(KCR) అభ్యర్థులను ప్రకటించారు. 1114 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు కేసీఆర్‌. ఈ నేపథ్యంలో కొంతమంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు షాకిచ్చారు. వేములవాడ(Vemulavada), స్టేషన్‌ ఘన్‌పూర్‌(Station Ghanpur), కోరుట్ల(Korutla), ఉప్పల్‌(Uppal), ఖానాపూర్‌(Khanapur), అసిఫాబాద్‌(Asifabad), కామారెడ్డి(Kamareddi), బోథ్‌, వైరా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు.

వైరి పక్షాలు కాంగ్రెస్‌(Congress), బీజేపీలు(BJP) ఇంకా అభ్యర్థుల ఎంపికలో తలమునకలుగా ఉన్న సమయంలోనే ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌(KCR) అభ్యర్థులను ప్రకటించారు. 1114 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు కేసీఆర్‌. ఈ నేపథ్యంలో కొంతమంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు షాకిచ్చారు. వేములవాడ(Vemulavada), స్టేషన్‌ ఘన్‌పూర్‌(Station Ghanpur), కోరుట్ల(Korutla), ఉప్పల్‌(Uppal), ఖానాపూర్‌(Khanapur), అసిఫాబాద్‌(Asifabad), కామారెడ్డి(Kamareddi), బోథ్‌, వైరా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. అలాగే గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్‌ పోటీ చేస్తున్నారు. 2009 నుంచి కామారెడ్డిలో వరుసగా నాలుగుసార్లు గెలిచిన గంగ గోవర్థన్‌ సీఎం కేసీఆర్‌ కోసం సీటు త్యాగం చేశారు. కోరుట్లలో ప్రస్తుత ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఆరోగ్య కారణాల దృష్ణ్యా ఆయన కొడుకు డాక్టర్‌ సంజయ్‌కు టికెట్ ఇచ్చారు. నర్సాపూర్‌, జనగామ, నాంపల్లి, గోషామహల్‌ స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. కోర్టు కేసు కారణంగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు టికెట్‌ను నిరాకరించారు కేసీఆర్‌. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ టికెట్‌ను దివంగత సాయన్న కూతురు లాస్యకు ఇచ్చారు.

Updated On 21 Aug 2023 6:24 AM GMT
Ehatv

Ehatv

Next Story