ఈనెల 6న చంద్రబాబు(chadrababu) హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా మరోసారి తెలంగాణ రాజకీయాలు(Telangana Politics) చర్చనీయాంశంగా మారాయి.

ఈనెల 6న చంద్రబాబు(chadrababu) హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా మరోసారి తెలంగాణ రాజకీయాలు(Telangana Politics) చర్చనీయాంశంగా మారాయి. బేగంపేట నుంచి చంద్రబాబు ఇంటి వరకు ర్యాలీ(Rally) చేపట్టిన తెలుగుదేశం శ్రేణులు హైదరాబాద్‌ను పసుపుమయం చేశాయి. అపరిష్కారంగా ఉన్న విభజన సమస్యలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజాభవన్‌లో సమావేశమై చర్చించారు. పలు రకాల సమస్యలపై ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు. సానుకూల వాతావరణంలో చర్చించుకుని సమస్యల పరిష్కారానికి కమిటీలు వ వేసి ముందుకెళ్లాలని నిర్ణయించారు.

ఆ తర్వాత ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో(NTR Trust Bhavan) టీడీపీ శ్రేణులతో సమావేశమైన చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ(TDP) ఆవిర్భవించిన గడ్డపై మళ్లీ బలపడుతుందన్నారు. ఏపీపై ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో తెలంగాణలో పార్టీ ప్రభావం తగ్గిపోయింది. కొందరు ఇతర పార్టీల్లో చేరిపోగా మరికొందరు ఇంకా పార్టీని నమ్ముతున్నారు. గత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎన్నికల్లో ఓడిపోవడంతో బీఆర్ఎస్(BRS) పార్టీ ఇప్పుడు బలహీన పడింది సరిగ్గా ఈ సమయంలోనే తెలంగాణలోనూ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నారట. లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేసినా ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పని ఇక అయిపోందన్న భావనలో చంద్రబాబు, టీడీపీ శ్రేణులు ఉన్నాయని వారి భావన. మరో ఏడాదిన్నరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో సత్తా చూపడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పునర్వైభవం సాధించవచ్చని టీడీపీ వ్యూహం పన్నుతోందంటున్నారు. ఇప్పటికే ఎన్డీయేకు టీడీపీ మిత్రపక్షంగా ఉండగా, జీహెచ్‌ఎంసీలో బీజేపీ బలంగా ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ముందుకెళ్లి తమ సత్తా చాటాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నారట. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే మరోవైపు చంద్రబాబు, రేవంత్‌ సమావేశంపై తెలంగాణవాదం మరోసారి పైకి వచ్చింది. మరోసారి తెలంగాణపై చంద్రబాబు పెత్తనం చెలాయించబోతున్నారని, రేవంత్ ఒకప్పుడు చంద్రబాబు శిశ్యుడిగా ఉన్నాడని.. అంతెందుకు ఇప్పటికీ చంద్రబాబు మాటను రేవంత్ జవదాటడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబును తెలంగాణపై పెత్తనం చెలాయించాలని చూసినా లేదా ఎన్నికల్లో పోటీ చేసినా కేసీఆర్‌ నెత్తి మీద పాలు పోసినట్లేనని తెలంగాణవాదులు విశ్లేషిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story