తెలంగాణ ఎన్నిక‌ల ఫలితాలకు(TS Election Result) స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది అంద‌రిలో ఉత్కంఠ పెరుగుతుంది. అధికార బీఆర్ఎస్‌తో(BRS) పాటు కాంగ్రెస్(Congress) పార్టీలు గెలుపు త‌మ‌దే అని ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి.

తెలంగాణ ఎన్నిక‌ల ఫలితాలకు(TS Election Result) స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది అంద‌రిలో ఉత్కంఠ పెరుగుతుంది. అధికార బీఆర్ఎస్‌తో(BRS) పాటు కాంగ్రెస్(Congress) పార్టీలు గెలుపు త‌మ‌దే అని ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ ఫోల్(Exist Poll) ఫ‌లితాలు కాంగ్రెస్ దే గెలుపు అని ప్ర‌క‌టించాయి. ఎగ్జిట్ ఫోల్స్‌.. ఎగ్జాక్ట్ పోల్స్ కాద‌ని బీఆర్ఎస్ నేత‌లు అంటున్నారు. మూడో సారి తామే అధికారంలోకి వ‌స్తున్నామ‌ని కేటీఆర్(KTR), క‌విత(Kavitha), ఇత‌ర బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ ఎక్క‌డా కూడా త‌గ్గడం లేదు. అందులో భాగంగానే సోమ‌వారం మ‌ధ్యాహ్నం కేబినెట్ భేటీ కూడా పిలుపునిచ్చింది.

ఇదిలావుంటే.. తాజాగా సీఎం క్యాంప్ ఆఫీస్(CM Camp Office) ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు(Pragathi Bhavan) సున్నం (Paints) వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను టీఆర్ఎస్ నాయ‌కుడు, టీఎస్ఎండీసీ ఛైర్మ‌న్ క్రిశాంక్(Krishank) సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టులో.. ద‌టీజ్‌ సీఎం కేసీఆర్.. కేసీఆర్ 3వ ప‌ర్యాయం కోసం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌కు రంగులు వేస్తున్నారు అని పేర్కొన్నారు. పోటాపోటీగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌ నేత‌ల చ‌ర్య‌లు ఫ‌లితాల‌పై మ‌రింత ఆస‌క్తిని పెంచుతున్నాయి.

Updated On 2 Dec 2023 6:15 AM GMT
Ehatv

Ehatv

Next Story