గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్(Tamil Sai Soundarya Rajan) తో కాంగ్రెస్(Congress) ప్రతినిధుల బృందం రాజ్ భవన్(Raj Bhavan) లో సమావేశమైంది. సీఎల్పీ(CLP) నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గవర్నర్‌తో భేటీ అయ్యింది. రాష్ట్రంలో గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని..

Congress group of representatives
గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్(Tamil Sai Soundarya Rajan) తో కాంగ్రెస్(Congress) ప్రతినిధుల బృందం రాజ్ భవన్(Raj Bhavan) లో సమావేశమైంది. సీఎల్పీ(CLP) నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధుల బృందం గవర్నర్‌తో భేటీ అయ్యింది. రాష్ట్రంలో గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని.. వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కాంగ్రెస్ బృందం గవర్నర్ ను కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
భట్టి విక్రమార్క వెంట గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, వర్కింగ్ ప్రసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వి. హనుమంతరావు, మాజీ ఎంపీ మల్లు రవి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీష్ తదితరులు ఉన్నారు.
మరోవైపు ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు బైటాయించారు. రాష్ట్రంలో వరదలతో పంటలు పాడై రైతులు తీవ్ర ఇబ్బందులలో ఉన్నారని వారిని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం ముందు బైటాయించారు.
