ప్రధాని మోదీ(Narendra Modi), సీఎం కేసీఆర్(CM KCR) ఇద్దరూ తోడు దొంగలేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) విమర్శించారు. క్రోని క్యాపిటలిస్టులకు దేశాన్ని మోదీ అమ్ముతుంటే.. రాష్ట్ర వనరులను సీఎం కేసీఆర్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నాడని ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పరిధిలోని ప్రగతి స్టేడియం పాదయాత్ర శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి(Rohit Chowdary)తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన హామీల ఊసే […]
ప్రధాని మోదీ(Narendra Modi), సీఎం కేసీఆర్(CM KCR) ఇద్దరూ తోడు దొంగలేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) విమర్శించారు. క్రోని క్యాపిటలిస్టులకు దేశాన్ని మోదీ అమ్ముతుంటే.. రాష్ట్ర వనరులను సీఎం కేసీఆర్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్నాడని ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పరిధిలోని ప్రగతి స్టేడియం పాదయాత్ర శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి(Rohit Chowdary)తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన హామీల ఊసే ఎత్తకుండా ప్రధాని మోదీ హైద్రాబాద్ వచ్చి రాజకీయ ప్రసంగం చేసి వెళ్లడం వల్ల ఎవరికి ప్రయోజనం కలిగిందని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన అత్యంత అవినీతిలో మునిగిందని మాట్లాడిన ప్రధాని మోదీ ఎందుకు విచారణకు ఆదేశించలేదని నిలదీశారు. "నువ్వు కొట్టినట్టు చేయ్. నేను ఏడ్చినట్టు చేస్తా" అని బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) పాలకులు కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
కోల్ ఇండియా(Coal India) సంస్థ ఏర్పాటు చేసి బొగ్గు గనులను స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ(Indira Gandhi) జాతీయం చేస్తే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ లు ప్రైవేటీకరణ చేసి అమ్ముతున్నారని విక్రమార్క మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ పాలకులు ఇద్దరూ కలిసే కావాలని సింగరేణి(Singareni) ఆస్తులు ప్రవేట్ పరం చేస్తున్నారని తెలిపారు. పార్లమెంట్ లో బీజేపీ తీసుకువచ్చిన ఎంఎండి ఆర్ (బొగ్గు గనుల ప్రవెటికరణ) బిల్లుకు బీఆర్ఎస్ ఎంపీలు అనుకూలంగా ఓట్లు వేసి.. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం నిరసనలు చేయడం హాస్యస్పదంగా ఉందని పేర్కొన్నారు. బొగ్గు గనులను దేశ సంపదగా గుర్తించిన ప్రధాని నెహ్రు, ఇందిరా ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రైవేట్ వ్యక్తుల నుంచి బొగ్గు గనులను తిరిగి తీసుకొని ప్రజలకు అప్పగిస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ మాయలో పడి ఎవరు కూడా బొగ్గు గనులను తీసుకోవద్దని సూచించారు.
రాష్ట్రంలో ఇప్పటికే హౌసింగ్ బోర్డ్ సంబంధించిన భూములు దిల్ సంస్థ కేటాయించిన భూములు సీఎం కేసీఆర్ విక్రయానికి పెట్టాడని వివరించారు. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ మాన్యాల భూములను బలవంతంగా తిరిగి గుంజుకొని వాటిల్లో ప్లాటు చేసి అమ్ముతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఇలాగే వదిలేస్తే భూములు, సింగరేణి తో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అమ్ముతాడని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి పాలించడానికి మాత్రమే ప్రజలు ఓట్లు వేశారని, ఆస్తులు అమ్మడానికి కాదని చురకలు వేశారు. టీఎస్పీఎస్సీ(TSPSC) లో మాత్రమే ప్రశ్న పత్రాలు లీకేజీ కాలేదని, సింగరేణిలో రిక్రూట్ చేసిన క్లరికల్ పోస్టుల్లో కూడా పేపర్ లీకేజీలు చేసి వారికి అనుకూలంగా ఉన్నవారికే ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి భారత రాష్ట్రపతికి సిఫారసు చేసి ఉండేవారన్నారు. ప్రజల ఆస్తులను, సంపదను లూటీ చేయడానికి బీజేపీ, బీఆర్ఎస్ పాలకులు దొంగ నాటకాలు ఆడుతూ ప్రజలను దారి మల్లిస్తున్నారని వివరించారు.