☰
✕
తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌కు(Somesh Kumar) సీఐడీ(CID) అధికారులు నోటీసులు(Notices) ఇచ్చారు.
x
తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌కు(Somesh Kumar) సీఐడీ(CID) అధికారులు నోటీసులు(Notices) ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ స్కామ్‌లో సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. 1400 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని సీఐడీ అధికారులు గుర్తించారట! వస్తువులు సరఫరా చేయక పోయిన చేసినట్లు, బోగస్ ఇన్వాయిస్ లు సృష్టించారన్నది అభియోగం. ఇందులో సోమేశ్‌తో పాటు మరికొందరి ప్రమేయం కూడా ఉందట! సీఐడీ అధికారులు సోమేశ్‌కుమార్‌తో పాటు తెలంగాణ వాణిజ్యపన్నులశాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ2గా ఉప కమిషనర్ శివరామ్‌ప్రసాద్, ఏ3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్‌బాబు, ఏ4గా ప్లియంటో టెక్నాలజీస్ కంపెనీలకు నోటీసలు ఇచ్చారు. సోమేశ్‌కుమార్ పేరును ఏ-5గా చేర్చారు పోలీసులు.
Eha Tv
Next Story