చొప్పదండి ఎమ్మెల్యే ఇంట విషాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపా దేవి ఆత్మహత్యకు పాల్ప‌డింది.

చొప్పదండి ఎమ్మెల్యే ఇంట విషాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపా దేవి ఆత్మహత్యకు పాల్ప‌డింది. రూపా దేవి అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స‌త్యం, రూపా దేవి దంప‌తుల‌కు ఇద్ద‌రు సంతానం. కాగా.. రూపాదేవి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. రూపా దేవి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.

మేడిపల్లి సత్యం భార్య రూపా దేవి మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపెళ్లి సత్యనారాయణ, విప్ అది శ్రీనివాస్ సంతాపం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

Eha Tv

Eha Tv

Next Story