ఇక నుంచి తెలుగు సినిమాలకు నంది అవార్డులకు(Nandi Award) బదులుగా గద్దర్‌ అవార్డులు(Gaddar Award)

ఇక నుంచి తెలుగు సినిమాలకు నంది అవార్డులకు(Nandi Award) బదులుగా గద్దర్‌ అవార్డులు(Gaddar Award) ఇస్తామని, తాను మాట ఇస్తున్నానంటే శాసనమని, జీవోలు గట్రాలు అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ప్రకటించి చాలా కాలమే అయ్యింది. ఇప్పటి వరకు దాని ఊసే లేదు. తాము సిన్సియర్‌గా ఉన్నా టాలీవుడ్‌ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం తీవ్ర విచారకరమని రేవంత్‌రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై సినీ పరిశ్రమ మౌనంగా ఉండ‌డం విచారకరమన్న రేవంత్ రెడ్డి, దీనిపై సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చాలా బాధాకరమ‌న్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై టాలీవుడ్‌ ప్రముఖులు రియాక్టవ్వడం మొదలుపెట్టారు. మెగాస్టార్‌ చిరంజీవి మొదట స్పందించారు. గతంలో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి మద్దతుగా తాను మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ , సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా గద్దర్ అవార్డ్స్ ప్రకటించడం హర్షణీయం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తర్వాత తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్(Film Chamber), ప్రొడ్యూసర్ కౌన్సిల్ (producer concil)ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ చిరంజీవి రాసుకొచ్చారు. తన పోస్టుకు తెలంగాణ సీఎంవోను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్(Telugu Film Producer Council) లను ట్యాగ్ చేశారు. నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadwaj) కూడా స్పందించారు. ముఖ్యమంత్రికి తీరిక లేకపోవడం వల్లను, మిస్‌ కమ్యూనికేషన్‌ వల్లనూ ఇదిముందుకు సాగడం లేదన్నారు. గద్దర్ అవార్డులకు సంబంధించి ముఖ్యమంత్రి ఎవరిని వెళ్లి కలవమన్నా తాము కలుస్తామని చెప్పారు. తాను కొన్ని పేపర్లు రెడీ చేశానని, బి. నర్సింగరావు(B.Narsinga Rao) కూడా కొంత వర్క్‌ చేశారని చెబుతూ తామిద్దరం ప్రయత్నించాం కానీ రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ దొరకలేదని అన్నారు.

ehatv

ehatv

Next Story