దేశంలో విద్వేషం పెచ్చుమీరుతోంది. మతాల మధ్య అంతరం పెరుగుతోంది. పదేళ్లలో ఇది ఎవరూ ఊహించనంతగా పెరిగింది. వాట్సప్‌ యూనివర్సిటీల నుంచి వచ్చే సందేశాల కారణంగా ముస్లింలపై(Muslim) అకారణంగా ద్వేషం పెంచుకుంటున్నారు కొందరు. ఇలాంటి సమయంలో ఆపదలో ఉన్న ఓ ముస్లిం వ్యవసాయ కుటుంబానికి చిలుకూరు(Chilukur) ఆలయ పూజారి(Temple priest) సాయం చేశారు.

దేశంలో విద్వేషం పెచ్చుమీరుతోంది. మతాల మధ్య అంతరం పెరుగుతోంది. పదేళ్లలో ఇది ఎవరూ ఊహించనంతగా పెరిగింది. వాట్సప్‌ యూనివర్సిటీల నుంచి వచ్చే సందేశాల కారణంగా ముస్లింలపై(Muslim) అకారణంగా ద్వేషం పెంచుకుంటున్నారు కొందరు. ఇలాంటి సమయంలో ఆపదలో ఉన్న ఓ ముస్లిం వ్యవసాయ కుటుంబానికి చిలుకూరు(Chilukur) ఆలయ పూజారి(Temple priest) సాయం చేశారు. భారతదేశమంటే ఇది అని రుజువు చేశారు. చిలుకూరు గ్రామ రైతు మొహమ్మద్‌ గౌస్‌కు చెందిన ఎద్దు చిలుకూరు ఆలయ పరిసరాలలో కరెంట్ షాక్‌తో చనిపోయింది. వ్యవసాయానికి కీలక ఆధారమైన ఎద్దును కోల్పోవడంతో గౌస్‌ డీలా పడ్డారు. విషయం తెలుసుకున్న చిలుకూరు ఆలయ పూజారి అతడికి ఎద్దును(Bull) బహుమతిగా ఇచ్చారు. ఇంతకు ముందు అంజియా అనే రైతుకు ఎద్దులను బహుమతిగా ఇచ్చారు ఆలయ పూజారులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని పెద్ద మంగళారం గ్రామానికి చెందిన అంజియా విద్యుదాఘాతంతో తన రెండు గేదెలను కోల్పోయాడు. కరెంట్‌ షాక్‌తోనో, పిడుగుపాటుతోనో మరేదైనా ప్రమాదంలో పశువులు చనిపోతే ఆ రైతు అనుభవించే బాధ వర్ణణాతీతం! అలాంటి రైతుల దుస్థితిని చూసి చలించిపోయిన చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ గోసేవ ఔత్సాహికుడు పవన్ కుమార్ సహాయంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది రైతులకు సహాయం చేశారు. గతంలో విద్యుదాఘాతంతో పశువులను కోల్పోయిన సిద్దిపేటకు చెందిన రైతుకు చిల్కూరు బాలాజీ దేవాలయం ఆవును అందించింది.

Updated On 19 March 2024 1:27 AM GMT
Ehatv

Ehatv

Next Story