కుత్బుల్లాపూర్(Qutbulapur) నియోజకవర్గం కొంపల్లిలోని(Kompally) పలు కాలనీలలో వీధి కుక్కలు(street daogs) స్వైర విహారం చేస్తున్నాయి.
కుత్బుల్లాపూర్(Qutbulapur) నియోజకవర్గం కొంపల్లిలోని(Kompally) పలు కాలనీలలో వీధి కుక్కలు(street daogs) స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డు మీదకు వస్తే చాలు మీదకొచ్చి కాటేస్తున్నాయి. ఈ క్రమంలో కుక్కల బారి నుంచి తమ ప్రాణాలు కాపాడండి అంటూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు చిన్నారులు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకుండాపోయిందని, కొంపల్లి మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్లపై చర్యలు తీసుకోవాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు చిన్నారులు. పెద్ద సంఖ్యలో పిల్లలు పోలీసుస్టేషన్‌కు తరలిరావడం చూసి పోలీసులు అశ్చర్యపోయారు. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలలో కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, బయటకు రావాలంటేనే భయమేస్తుందని పోలీసులతో చిన్నారులు మొరపెట్టుకున్నారు. కుక్కల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినా వారు అలసత్వం వహిస్తున్నారని చిన్నారులు మండిపడ్డారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంకుల్, కమిషనర్ అంకుల్, స్థానిక ఎమ్మెల్యే వివేక్ అంకుల్ తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.