బీఆర్ఎస్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నేత, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ గూటికి చేరారు.
బీఆర్ఎస్(BRS)కు మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నేత, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య(Chevella MLA Kale Yadaiah) కాంగ్రెస్(Congress) గూటికి చేరారు. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన ఆయన అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ(Big Shock To BRS, Chevella MLA Kale Yadaiah Joins Congress in the Presence Of CM Revanth Reddy, Deepa Dasmunsi) సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. యాదయ్యకు కండువా కప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యేఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారిని కాపాడుకునేందుకు ఇటీవల గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయ్యారు. త్వరలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యేలతో కూడా భేటీకి ప్లాన్ చేశారు. ఈ సమయంలో వలసలకు కాస్తా బ్రేక్ పడుతుందని పార్టీ శ్రేణులు భావించాయి. కానీ అలా జరగడం లేదు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవడంతో కేడర్‌లో ఆందోళన మొదలైంది.