వేములవాడ ఎమ్మెల్యే డా. చెన్నమనేని రమేశ్ బాబుకు సీఎం కేసీఆర్ కీలక పదవి కట్టబెట్టారు. ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాలో రమేశ్ బాబు పేరు లేదు. పౌరసత్వం సమస్య కారణంగా పేరు జాబితాలో చేర్చలేదని సీఎం కేసీఆర్ తెలిపారు.

Chennamaneni Ramesh as Adviser to Government on Agricultural Affairs
వేములవాడ ఎమ్మెల్యే(Vemulawada MLA) డా. చెన్నమనేని రమేశ్ బాబు(Chennamaneni Ramesh)కు సీఎం కేసీఆర్(CMKCR) కీలక పదవి కట్టబెట్టారు. ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాలో రమేశ్ బాబు పేరు లేదు. పౌరసత్వం సమస్య కారణంగా పేరు జాబితాలో చేర్చలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలోనే ‘రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు’ గా (Adviser to Government on Agricultural Affairs) వ్యవసాయ శాస్త్రవేత్త, ఫ్రొఫెసర్ అయిన వేములవాడ ఎమ్మెల్యే డా. చెన్నమనేని రమేశ్ బాబును ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. కేబినెట్ హోదా కలిగివున్న ఈ పదవిలో రమేశ్ బాబు 5 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేయనున్నది.
రమేశ్ బాబు జర్మనీ(Germany)కి చెందిన ప్రతిష్టాత్మక ‘హంబోల్ట్ యూనివర్శిటీ’ నుంచి ‘అగ్రికల్చర్ ఎకనామిక్స్’ లో పరిశోధనలు చేసి పీహెచ్‌డీ(PHD) పట్టాను పొందారు. పరిశోధనా విద్యార్థిగా, ప్రొఫెసర్ గా ఆయనకు అగ్రికల్చర్ ఎకానమి’ అంశం పట్ల వున్న అపారమైన అనుభవం, విస్తృత జ్జానాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయాభివృద్ధికోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రమేశ్ బాబు ముఖ్యమంత్రికి సలహాదారుగా వ్యవహరించనున్నారు.
