చెడ్డి గ్యాంగ్(chedi gang) మరోసారి రెచ్చిపోయింది. హఫీజ్‌పెట్‌లోని వరల్డ్ ఓన్ స్కూల్లో(World Own School) చెడ్డి గ్యాంగ్ చోరికి పాల్పడి 7,85,000 రూపాయల నగదు దొంగిలించారు. ఈ సంఘటన మియాపూర్(Miyapur) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Chaddi Gang In Miyapur
చెడ్డి గ్యాంగ్(chedi gang) మరోసారి రెచ్చిపోయింది. హఫీజ్‌పెట్‌లోని వరల్డ్ ఓన్ స్కూల్లో(World Own School) చెడ్డి గ్యాంగ్ చోరికి పాల్పడి 7,85,000 రూపాయల నగదు దొంగిలించారు. ఈ సంఘటన మియాపూర్(Miyapur) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ దుర్గారామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ న్యూ హాఫీజ్‌పేట్ వరల్డ్ ఓన్ స్కూల్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ ద్వారా లోపలికి దూరి లాకర్‌లను పగల గొట్టి అందులో ఉన్న 7,85000 నగదు ను ఎత్తుకెళ్లరు. ఉదయం సిబ్బంది స్కూల్ కి వచ్చి చూడగా దొంగతనం అయిందని గుర్తించి స్కూల్ యాజమాన్యం మియాపూర్ పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని స్కూల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు పోలీసులు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నల్లటి మస్కు లు వేసుకొని, చెడ్డిలు వేసుకొని లోపలి చొరబడి దొంగతనం చేసినట్టు గుర్తించారు. ఇది చెడ్డి గ్యాంగ్ పనే అనే పోలీసులు అనుమానిస్తున్నారు.
