ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి కేఏ పాల్ తన వద్ద నుంచి 50 లక్షలు తీసుకున్నాడని.. అయినా టికెట్ ఇవ్వలేదని రంగారెడ్డి జిల్లా జిల్లెల్లగూడకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 30 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లించిన తాను.. మిగిలిన 20 లక్షలను పలుదఫాలుగా చెల్లించినట్లు కిరణ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేఏ పాల్ విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేశారు. పాల్ ఎన్ని ఓట్లు సాధిస్తారనే విషయమై జనాలలో ఆసక్తి నెలకొంది.