ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లకు(Chain snatch) పాల్పడే స్నాచర్లు ఇప్పుడు వారి దృష్టి మగవారిపైకి మారింది. ఒంటరిగా ఉంటున్న పురుషులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కిరాణాషాపు యజమాని కంట్లో కారం చల్లి మెడలో ఉన్న గొలుసును లాక్కొని పరారయ్యారు.
ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లకు(Chain snatch) పాల్పడే స్నాచర్లు ఇప్పుడు వారి దృష్టి మగవారిపైకి మారింది. ఒంటరిగా ఉంటున్న పురుషులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ కిరాణాషాపు యజమాని కంట్లో కారం చల్లి మెడలో ఉన్న గొలుసును లాక్కొని పరారయ్యారు. హైదరాబాద్(Hyderabad) వనస్థలిపురంలో(Vanasthalipuram) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాహెబ్‌నగర్ పద్మావతికాలనీలో బండారి గోవర్ధన్(Govardhan) శ్రీ మహాలక్ష్మి కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 6 గంటలకు రవీంద్ర భారతి పాఠశాల దగ్గరలో ఉన్న మిల్క్ సెంటర్ నుంచి పాలను తీసుకొని గోవర్ధన్ వస్తుండగా ఇద్దరు చైన్ స్నాచర్లు అతడిపై కన్నేశారు. వారు అతనిని వెంబడించి కళ్ళలో కారం చల్లి మెడలోని బంగారు గొలుసు లాక్కొని బైక్ పారిపోయారు. కళ్లలో కారాన్ని దులుపుకుని వారిని వెంబడించినా ప్రయోజనం లేదు. బాధితుడు గోవర్ధన్ వెంటనే వనస్థలిపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చైన్ స్నాచర్ల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు