తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్(Polling) ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్(Voting) ప్రక్రియ మొదలైంది.

CEO Vikas Raj said that the voting percentage will increase this time
తెలంగాణ(Telangana)లోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్(Polling) ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్(Voting) ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికల బరిలో ఉన్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.
ఇదిలావుంటే.. సీఈవో వికాస్ రాజ్(CEO Vikas Raj) కుటుంబ సభ్యులతో కలిసి సనత్ నగర్(Sanath Nagar) నారాయణ కాలేజ్(Narayana College) పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుంది.. కొన్ని చోట్ల ఈవీఎంలలో ఇబ్బందులు వచ్చాయి.. వాటిని సాల్వ్ చేస్తున్నాం.. కొత్త ఓటర్లు యువత ఓటు వేయడానికి రావాలి.. బూత్ ఎక్కడుంది అనేది యాప్ లో తెలుసుకోండి.. లొకేషన్ తో పాటు ఉంటుంది.. ఓటింగ్ పై అవగాహన కల్పించాం.. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటింగ్ జరుగుతుంది.. ఈ సారి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని అన్నారు.
