మోటారు వాహనాల చట్టం, 1988 (59 ఆఫ్ 1988)లోని సెక్షన్ 41లోని సబ్-సెక్షన్ (6) ద్వారా అందించబడిన
తెలంగాణలో ‘TS’ స్థానంలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌లకు ‘TG’ ప్రిఫిక్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీనికి సంబంధించి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
మోటారు వాహనాల చట్టం, 1988 (59 ఆఫ్ 1988)లోని సెక్షన్ 41లోని సబ్-సెక్షన్ (6) ద్వారా అందించబడిన అధికారాలను ఉపయోగించి, కేంద్ర ప్రభుత్వం సవరణను చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద.. టీఎస్ స్థానంలో టీజీని ప్రవేశపెడుతూ కేంద్ర రహదారి రవాణాశాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 1989 జూన్ 12న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన గెటిట్‌లో ఈ మేరకు మార్పులు చేసింది. దీంతో ఇకపై వాహనాలకు టీఎస్ కాకుండా టీజీ అంటూ రానుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ను మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది.కేంద్రం తగు మార్పులు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలో కొత్త వాహనాలను టీజీ మార్కుతో రిజిస్టర్ చేయనున్నారు. ఇక ‘TS’ స్థానంలో ‘TG’ ఉండనుందన్నమాట.