బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సూర్జేవాలా ఫిర్యాదు చేయడంతో ఈసీ నోటీసులు పంపించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President), మంత్రి కేటీఆర్(KTR) కు కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) నోటీసు(Notice)లు జారీ చేసింది. కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సూర్జేవాలా(Congress MP Randeep Surjewala) ఫిర్యాదు చేయడంతో ఈసీ నోటీసులు పంపించింది. రాజకీయ కార్యకలాపాల కోసం టీ వర్క్స్(T Works) ను వాడుకున్నారని.. కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలలోపు వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులలో పేర్కొంది.
టీ వర్క్స్‌లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్(Student tribe) కార్యక్రమంలో.. ప్రభుత్వ ఉద్యోగాలు(Govt Jobs) భర్తీ చేస్తామని విద్యార్థులకు కేటీఆర్(KTR) హామీ ఇచ్చారని.. అలాగే టీఎస్‌పీఎస్సీ(TSPSC)ని ప్రక్షాళన చేస్తామని కూడా చెప్పారని.. తద్వారా ఎన్నికల కోడ్(Election Code) అమల్లో ఉన్న సమయంలో రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ కార్యాలయం టీ వర్క్స్‌ను ఉపయోగించుకున్నారని సూర్జేవాలా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ.. కేటీఆర్ ప్రాథమిక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.