మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో మంగళవారం విచారణకు రాలేనంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి(avinash Reddy) రాసిన లేఖకు సీబీఐ స్పందించింది. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు మరోసారి ఆయనకు నోటీసులు పంపారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో మంగళవారం విచారణకు రాలేనంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి(avinash Reddy) రాసిన లేఖకు సీబీఐ స్పందించింది. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు మరోసారి ఆయనకు నోటీసులు పంపారు. హైదరాబాద్(Hyderabad) లోని సీబీఐ(CBI) కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులలో సూచించారు. వివేకా హత్య కేసులో మంగళవారం జరగనున్న విచారణకు తాను హాజరు కాలేనని తెలియజేసేందుకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. ముందుగా నిర్ణయించుకున్న కొన్ని పనుల కారణంగా నాలుగు రోజులు విచారణకు హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నాడు. మంగళవారం ఉదయం అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం కొన్ని అత్యవసర పనుల్లో నిమగ్నమై ఉన్నందున విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు వివరించారు.