సీబీఐ మంగళవారం బషీర్‌బాగ్‌లోని జీఎస్టీ భవన్‌లోని సెంట్రల్ టాక్స్ ప్రిన్సిపల్ కమిషనరేట్ ఇన్‌స్పెక్టర్ మనీష్ శర్మ, సూపరింటెండెంట్ వీడీ ఆనంద్ కుమార్ ల‌పై కేసు నమోదు చేసింది

సీబీఐ మంగళవారం బషీర్‌బాగ్‌లోని జీఎస్టీ భవన్‌లోని సెంట్రల్ టాక్స్ ప్రిన్సిపల్ కమిషనరేట్ ఇన్‌స్పెక్టర్ మనీష్ శర్మ, సూపరింటెండెంట్ వీడీ ఆనంద్ కుమార్ ల‌పై కేసు నమోదు చేసింది. ఐటీ రిటర్నులపై అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. ఇద్దరు అధికారులు వేధించి రూ. 5 లక్షలు దోపిడీ చేశారని ఒక ప్రైవేట్ వ్యాపార యజమాని చేసిన‌ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు.

ఫిర్యాదు ప్రకారం,.. ఇద్దరు అధికారులు ఫిర్యాదుదారుని ఐరన్ స్క్రాప్ షాప్ వ్యాపారంకు సంబంధించి అక్ర‌మాల లోగుట్టును తెలుసుకుని GST క‌ట్టాల‌ని ఫిర్యాదుదారుని బెదిరించారు. జూలై 4న దుకాణాన్ని సీజ్ చేశారు. తరువాత అధికారులు రూ. 5 లక్షలు లంచం డిమాండ్ చేసి స్వీకరించారు. మళ్లీ షాపు తెరవడానికి మరో రూ. 3 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధిత వ్యాపారి ఫిర్యాదు మేర‌కు.. సీబీఐ అధికారులు ఆగస్టు 13న హైదరాబాద్‌లోని రెండు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నేరారోపణలకు సంబంధించిన ఆధారాలను క‌నుగొన్నారు. ఆపై కేసు న‌మోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story