నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్ఐ కృష్ణ కుమార్ శుక్రవారం ఓ బాధితుడి వద్ద రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా చిక్కారు..

నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్ఐ కృష్ణ కుమార్ శుక్రవారం ఓ బాధితుడి వద్ద రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా చిక్కారు.. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తన సిబ్బందితో కలిసి రైడ్ చేసి బాధితుడి వద్ద ఎస్ఐ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వర్ని మండలం కోటయ్య క్యాంపుకు చెందిన నాగరాజు అనే రైతుకు ఐదు రోజుల క్రితం ఓ వ్యక్తితో వర్ని మండల కేంద్రంలో గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. దీంతో, ఈ కేసులో ఎస్ఐ కృష్ణ కుమార్ నాగరాజుపై కేసు నమోదు చేశారు. నాగరాజుకు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్ఐ కృష్ణ కుమార్ నాగరాజు నుంచి రూ. 50 వేలు ఇవ్వాలని నాగరాజును డిమాండ్ చేశారు. చిన్నపాటి గొడవకు ఇంత పెద్ద మొత్తంలో తాను ఇచ్చుకోలేనని ఎస్సైతో లంచం డబ్బుల కోసం బేరమాడారు. చివరికి రూ. 20 వేలకు ఎస్ఐ కృష్ణకుమార్‌కు బాధితుడు నాగరాజుకు మధ్య పరస్పర ఒప్పందం కుదిరింది. ఎస్సై తనను లంచం డబ్బుల కోసం వేధించిన తీరుతో నాగరాజు ఎలాగైనా అధికారులకు పట్టించాలని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి వారితో కలిసి పథక రచన చేశారు. తమ ప్లాన్ లో భాగంగా బాధితుడు నాగరాజు శుక్రవారం ఎస్సై కృష్ణ కుమార్ కు రూ. 20 వేలు లంచం డబ్బులు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ డీఎస్పీ శేఖర్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి బాధితుడి నుంచి లంచం డబ్బలు తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ehatv

ehatv

Next Story