ఎంపీ రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) నాగర్ కర్నూల్(Nagar Kurnool) లో పోలీసు కేసు నమోదైంది. పోలీసులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. పోలీసులను బట్టలు ఊడదీసి కొడతాను అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించింది.

Police Case On Revanth Reddy
ఎంపీ రేవంత్ రెడ్డిపై(Revanth Reddy) నాగర్ కర్నూల్(Nagar Kurnool) లో పోలీసు కేసు నమోదైంది. పోలీసులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. పోలీసులను బట్టలు ఊడదీసి కొడతాను అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించింది. గాంధీభవన్‌లో(Gandhi bhavan) పార్టీ జాయినింగ్ మీటింగ్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్(Mahbub Nagar) జిల్లా పోలీసులను ఒక్కొక్కడిని గుడ్డలూడదీసి కొడ తానని అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖలపై మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం.. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. బూత్పుర్ పోలీస్ స్టేషన్, జడ్చెర్ల పోలీస్ స్టేషన్ 153, 504, 505 (2), 506 IPC సెక్షన్ల కింద ఎంపీ రేవంత్ రెడ్డిపై కేసు నమోదయ్యింది.
