బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై కేసు(Case) నమోదు అయ్యింది. భూపాలపల్లి(Bhupalapally) జిల్లా మహాదేవపూర్(Mahadevpur) పోలీసు స్టేషన్ లో బీఎన్ఎస్ 223(b) కింద ఎఫ్ఐఆర్(FIR) నమోదు అయ్యింది.
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై కేసు(Case) నమోదు అయ్యింది. భూపాలపల్లి(Bhupalapally) జిల్లా మహాదేవపూర్(Mahadevpur) పోలీసు స్టేషన్ లో బీఎన్ఎస్ 223(b) కింద ఎఫ్ఐఆర్(FIR) నమోదు అయ్యింది. అనుమతి లేకుండా మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barage) వద్ద డ్రోన్(Drone) ఎగరేసి విజువల్స్ చిత్రీకరించారనే ఆరోపణలపై కేటీఆర్ తో పాటు బాల్క సుమన్(Balka Suman), గండ్ర వెంకటరమణా రెడ్డి(Gandra Venkata Ramana Reddy)ల మీద కేసు నమోదు అయ్యింది. ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 26న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించారు. ఆ సమయంలోనే బీఆర్ఎస్ శ్రేణులు అనుమతులు లేకుండా డ్రోన్ ఎగరవేసి అక్కడి విజువల్స్ చిత్రీకరించినట్లు.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సదరు ఇరిగేషన్ అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.