బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం పలువురు సెలెట్రిటీలను బెడిసికొట్టింది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం పలువురు సెలెట్రిటీలను బెడిసికొట్టింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌పై పంజాగుట్ట పోలీసులు విచారణను వేగవంతం చేశారు. యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సహా పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు యాంకర్, బిగ్‌బాస్ ఫేమ్ విష్ణుప్రియ, యూట్యూబర్, కమెడియన్ టేస్టీ తేజకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించారు. విచారణ తర్వాత మరికొందరికి సైతం విచారణకు రావాలని నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల, హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, రీతూ చౌదరి, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్ పలువురిపై పలు సెక్షన్లతో పాటు యాక్టుల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే సేకరించిన యాప్స్ లింక్స్ ఆధారంగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలకు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
