తెలంగాణలో (Telangana)భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కమర్షియల్ ట్యాక్స్‌లో(Commercial Tax)అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు.
తెలంగాణలో (Telangana)భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కమర్షియల్ ట్యాక్స్‌లో(Commercial Tax)అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌తో(Ex Cs Somesh Kumar) పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. కమర్షియల్ ట్యాక్స్ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో స్కామ్ జరిగినట్టు అధికారులు గుర్తించారు. దాదాపు 1000 కోట్ల(1000 Crore) రూపాయల అవకతవకలు జరిగాయని అధికారులు అంటున్నారు. 75 కంపెనీలు ఈ కుంభకోణానికి పాల్పడ్డినట్టు చెప్పారు. ఈ కుంభకోణంలో లబ్ధి పొందిన జాబితాలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉంది. ఈ మొత్తం వ్యవహారం ఫోరెన్సిక్ అడిట్‌తో బయటపడింది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సూచనలతో ట్యాక్స్ పేమెంట్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరిగాయంటున్నారు అధికారులు. ఈ వ్యవహారంపై మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు ఐఐటీ హైదరాబాద్(iit Hyderabad) అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు(ProfessorShobhanbabu), కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు(kashi visweswarao), డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్(shivaram Prasad), పిలాంటో టెక్నాలజీస్‌లపై కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి(ravi Kanuri) సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 406,409,120B ఐటీ యాక్ట్ (It Act)కింద కేసు నమోదు చేశారు పోలీసులు.