ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదయింది. ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బాల్క సుమన్‌పై 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల […]

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదయింది. ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బాల్క సుమన్‌పై 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బాల్క సుమన్.. రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ తన కాలికి ఉన్న చెప్పును తీసి చూపించారు. రేవంత్ రెడ్డి పెద్ద రండగాడు.. హౌలేగాడు అంటూ దూషించారు.

బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ రేవంత్ రెడ్డిపై అనుచిత పదాలు వాడారు. ఇలా మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు. కేసీఆర్‌ను లంగా అంటున్న రేవంత్ రెడ్డినే పెద్ద రండగాడు, హౌలేగాడు అంటూ దూషించారు. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదని, సంస్కారం అడ్డువచ్చి ఆగుతున్నామని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తన పదవిని, స్థాయిని బట్టి మాట్లాడాలని సూచించారు.

Updated On 5 Feb 2024 10:47 PM GMT
Yagnik

Yagnik

Next Story