ఇటీవల మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ రేవంత్ రెడ్డిపై

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తాజాగా పోలీసులు నోటీసులు అందజేశారు. నోటీసులపై బాల్క సుమన్ సంతకం చేశారు. పోలీసుల నోటీసులపై బాల్క సుమన్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని పోరాడిన పార్టీ తమదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు. విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పారు. కేసులను ఎదుర్కొని పోరాటం చేసిన పార్టీలో ఉన్నాననీ చెప్పారు బాల్క సుమన్.

ఇటీవల మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ రేవంత్ రెడ్డిపై అనుచిత పదాలు వాడారు. ఇలా మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఓ సమయంలో తన కాలికి ఉన్న చెప్పును తీసి చూపించారు. కేసీఆర్‌ను లంగా అంటున్న రేవంత్ రెడ్డినే పెద్ద రండగాడు, హౌలేగాడు అంటూ దూషించారు. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదని, సంస్కారం అడ్డువచ్చి ఆగుతున్నామని వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామని అంటున్నారని ఆరోపించారు.

Updated On 11 Feb 2024 4:56 AM GMT
Yagnik

Yagnik

Next Story