గద్వాల్ జిల్లా కొత్తకోట ఓ వసతిగృహంలో కేర్ టేకర్ ఓ విద్యార్ధి నాయకుడితో వివాహేతర సంబంధం

గద్వాల్ జిల్లా కొత్తకోట ఓ వసతిగృహంలో కేర్ టేకర్ ఓ విద్యార్ధి నాయకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుని తరచూ వసతిగృహానికే రాత్రివేళ పిలిపించుకుంటున్నట్లు గ్రామానికి చెందిన యువకులు గుర్తించారు. దీంతో కాపుకాసి ఉండగా రాత్రి 10.30 గంటల సమయంలో ఓ కారు వసతిగృహంలోకి వెళ్లింది. యువకులు వసతిగృహం వద్దకు వెళ్లి నిలదీయగా తమ కూతురు అక్కడే చదువుతుందని ఆమెను కలిసేందుకు వచ్చినట్లు చెప్పారు. అదే సమయంలో అక్కడ ఓ ద్విచక్ర వాహనం ఉన్నట్లు గుర్తించిన యువకులు ఆదెవరిదని కేర్ టేకర్‌ను నిలదీశారు.. దీంతో ఆమె వారితో వాగ్వాదానికి దిగగా యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి రాత్రి వేళ వసతిగృహంలోకి వెళ్లలేమని చెప్పి వెనుదిరగడంతో ఎంఈవోకి ఫిర్యాదు చేసి పిలిపించారు. ఆయన వచ్చి ద్విచక్ర వాహనాన్ని పరిశీలించారు. వాహనం ప్లగ్ పీకేసి టైర్లలో గాలి తీసి ఉదయం మాట్లాడదామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉదయం అక్కడికి వెళ్లి చూడగా ద్విచక్ర వాహనం కనిపించలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయగా విచారణ జరిపించి కేర్ టేకర్‌ను, ఆ రాత్రి విధుల్లో ఉన్న వాచ్‌మెన్, ఏఎన్ఎంలను కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ehatv

ehatv

Next Story