✕
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, మధ్యంతర బెయిల్ ఘటనలపై ఇప్పటికే పలువురు ప్రముఖులు రియాక్టయ్యారు.

x
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్, మధ్యంతర బెయిల్ ఘటనలపై ఇప్పటికే పలువురు ప్రముఖులు రియాక్టయ్యారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఎక్స్ వేదికగా స్పందించాడు. అల్లు అర్జున్(Allu Arjun)ను అరెస్ట్ చేసిన అధికారులకి ఆయన నాలుగు ప్రశ్నలను సంధించారు 1. పుష్కరాలు, బ్రహ్మోత్సవం లాంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు పోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా ? 2.ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తారా ? 3. ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా పోతే హీరో, హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా ? 4. భద్రత ఏర్పాట్లను పోలీసులు, ఆర్గనైజర్లు తప్ప సినీ నటులు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చెయ్యగలరు అంటూ ప్రశ్నలు వేశారు వర్మ. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ehatv
Next Story