తెలంగాణ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే ప్రచారానికి గడువు. దీంతో పార్టీలన్ని చివరి రోజు ప్రచారంలో తలమునకలయ్యాయి.

Campaigning of top Congress leaders in 8 constituencies on the last day
తెలంగాణ ఎన్నికల(Telangana Elections) ప్రచారం నేటితో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే ప్రచారానికి గడువు. దీంతో పార్టీలన్ని చివరి రోజు ప్రచారంలో తలమునకలయ్యాయి. కాంగ్రెస్ నేతలు రాహుల్(Rahul Gandhi), రేవంత్(Revanth Reddy), ప్రియాంక(Priyanka Gandhi) చివరి రోజు ప్రచారం చేయనున్నారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్(Hyderabad) లో రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ లలో పాల్గొననున్నారు. 10 గంటలకు జూబ్లీహిల్స్, 12 గంటలకు నాంపల్లి(Nampally), 2 గంటలకు మల్కాజ్ గిరి(Malkajgiri) ఆనంద్ బాగ్ చౌరస్తాలలో నిర్వహించనున్న రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ లలో ఆయన పాల్గొంటారు. ప్రియాంక గాంధీ ఈ రోజు ఉదయం 11:30 - 12:30 గంటలకు జహిరాబాద్ లో ప్రచారం చేయనున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు కామారెడ్డి, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కామారెడ్డి పట్టణం, దోమకొండ, బీబీపేట్ లో రోడ్ షో లలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు కామారెడ్డి పట్టణం, ఉదయం 11 గంటలకు దోమకొండ, మధ్యాహ్నం 12 గంటలకు బీబీపేట్.. మధ్యాహ్నం 2.30 గంటలకు మల్కాజ్ గిరిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి రోడ్ షో లో పాల్గొంటారు.
