సింగరేణిలో (Singareni) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల(ELections) ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. తెలంగాణలోని ఆరు జిల్లా పరిధిలో కోల్ బెల్ట్‌ ఏరియాలో(Coal Belt Area) అన్ని కార్మికసంఘాలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. చివరి రోజు ప్రచారంలో హేమహేమి నాయకులు పాల్గొన్నారు. కార్మికుల ఓట్లను అకట్టు కోవడానికి తెలంగాణ మంత్రులు కార్మికులకు పలు వరాలను ప్రకటించారు.

సింగరేణిలో (Singareni) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల(ELections) ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. తెలంగాణలోని ఆరు జిల్లా పరిధిలో కోల్ బెల్ట్‌ ఏరియాలో(Coal Belt Area) అన్ని కార్మికసంఘాలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. చివరి రోజు ప్రచారంలో హేమహేమి నాయకులు పాల్గొన్నారు. కార్మికుల ఓట్లను అకట్టు కోవడానికి తెలంగాణ మంత్రులు కార్మికులకు పలు వరాలను ప్రకటించారు. తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.మరోవైపు, బుధవారం జరిగే పోలీంగ్‌(Polling) కు సింగరేణి అధికారులు సర్వం సిద్దం చేశారు. ఉత్తర తెలంగాణలో గోదావరి తీరం(Godhavari Cost) లోని ఆరు జిల్లాల పరిధిలో 11 ఏరియాలో ఈ ఎన్నికల పోలీంగ్ జరగనుంది.1998 నుంచి సింగరేణిలో కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి మొదట రెండేళ్లు ఉండగా తర్వాత నాలుగేళ్లకు పెంచారు.

మొత్తం 39,773 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల విధులకు 650 మంది ప్రభుత్వ ఉద్యోగులను(Government employees), బందోబస్తు విధులకు 460 మంది పోలీసులను(Police) కేటాయించారు. రహస్య బ్యాలెట్‌(Seceret Ballet) పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ఈ సంస్థలో ఇప్పటి వరకు ఆరు సార్లు ఎన్నికలు జరుగగా వీటిలో అత్యధికంగా సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ మూడు సార్లు, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ ఓసారి, బీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రెండు సార్లు విజయం సాధించాయి.ఏడో పర్యాయం జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ తో పాటు బీఆర్‌ఎస్ అనుబంధ సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ సంఘంతో పాటు మరో పది కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి. సీఐటీయూ, బీఎంఎస్, హెచ్‌ఎంఎస్ జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి తమ ఉనికిని కాపాడు కోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

Updated On 26 Dec 2023 12:26 AM GMT
Ehatv

Ehatv

Next Story