ఓ క్యాబ్ డ్రైవర్(Cab driver) తన కారులో వింతైన బోర్డు ఏర్పాటు చేశాడు.
ఓ క్యాబ్ డ్రైవర్(Cab driver) తన కారులో వింతైన బోర్డు ఏర్పాటు చేశాడు. తన క్యాబ్‌లో ప్రయాణించే జంట(couples) ప్రవర్తనకు విసుగు చెందాడో ఏంటో కానీ.. సర్‌క్యాస్టింగ్ బోర్డు పెట్టాడు. దీంతో క్షణాల్లో ఈ బోర్డు వైరల్‌గా మారింది. ఎక్కడో కాదు మన హైదరాబాద్‌లోనే(Hyderabad).. ఓ క్యాబ్ డ్రైవర్ ఇలా బోర్డు పెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంతకీ అతను పెట్టిన బోర్డులో ఏముందంటే . ' ఇది హెచ్చరిక.. ఇక్కడ 'శృంగారానికి'(Romance) తావు లేదు. ఇది మీ ప్రైవేట్ స్థలం కాదు. ఓయో అంతకన్నా కాదు.. ఒకరినొకరు దూరంగా ఉండండి.. నిశ్శబ్దంగా ఉండండి' అంటూ బోర్డు రాశాడు. ఈ చిత్రాన్ని మొదట Xలో వెంకటేష్ అనే వ్యక్తి పోస్ట్ చేశారు. హాయ్ హైదరాబాద్ ద్వారా మళ్లీ పోస్టు చేయడంతో ఇది వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. క్యాబ్‌లో ప్రయాణించే జంటలకు నైతికత ఉండాలి, వారికి ఇది సరైన సందేశం అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు మరొకరు, "పాపం. వీటిని బెంగళూరు మరియు ఢిల్లీలో చూశాను కానీ హైదరాబాద్‌లో ఇంత త్వరగా చూస్తానని మరొకరు వ్యాఖ్యానించారు.