తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికల్లో(Lok Sabha Election) ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్న అంశంపై ఇప్పటికే చాలా సర్వేలు(Survey) వచ్చాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ ఎంఐఎం(MIM) మినహాయిస్తే మిగిలిన 16 మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌(Congress), బీజేపీలే(BJP) గెలుస్తాయని పలు సర్వేలు వెల్లడించాయి. అసలు తెలంగాణలో బీఅర్ఎస్(BRS) ఉనికే లేదని కాంగ్రెస్, బీజేపీలు చెప్తున్నాయి.

తెలంగాణలో లోక్‌ సభ ఎన్నికల్లో(Lok Sabha Election) ఏ పార్టీకి ఎన్ని సీట్లు అన్న అంశంపై ఇప్పటికే చాలా సర్వేలు(Survey) వచ్చాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ ఎంఐఎం(MIM) మినహాయిస్తే మిగిలిన 16 మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌(Congress), బీజేపీలే(BJP) గెలుస్తాయని పలు సర్వేలు వెల్లడించాయి. అసలు తెలంగాణలో బీఅర్ఎస్(BRS) ఉనికే లేదని కాంగ్రెస్, బీజేపీలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు సీ-ప్యాక్‌(C-PAC) అనే సంస్థ ఓ సర్వేను విడుదల చేసింది. ఈ సర్వేలో అనూహ్యంగా బీఆర్‌ఎస్‌కు అధిక సీట్ల వస్తాయని సీ ప్యాక్‌ ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ తర్వాతి స్థానంలో నిలవడం గమనార్హం. తెలంగాణలో 34.54 శాతం ఓట్లతో బీఆర్ఎస్ 8 లోక్ సభ స్థానాలు, 27.17 శాతం ఓట్లతో బీజేపీ 2 స్థానాలు, 30.03 శాతం ఓట్లతో కాంగ్రెస్ 6 స్థానాలు,2 .18 శాతం ఓట్లతో ఎంఐఎం ఒక స్థానం గెలుచుకుంటుందని వెల్లడించింది.

ఇదే సీ-ప్యాక్ సంస్థ గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ 60, బీఆర్ఎస్ 40, బీజేపీ 4, బీఎస్పీ 2, ఎంఐఎం 5, ఎంబీటీ 1, సీపీఐ 1 స్థానంలో గెలుస్తాయి అని వెల్లడించడం విశేషం. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ 64, సీపీఐ 1, బీఆర్ఎస్ 39, ఎంఐఎం 7, బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించాయి.

నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని తెలిపింది.
నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, భువనగిరి, జహీరాబాద్, ఆదిలాబాద్, నల్గొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలవనుందని చెప్పగా.. చేవెళ్ల, మహబూబ్‌నగర్‌లో బీజేపీ, హైదరాబాద్‌ స్థానాన్ని ఎంఐఎం దక్కించుకోనున్నట్లు సీ-ప్యాక్‌ సర్వే తెలిపింది.

Updated On 17 April 2024 5:10 AM GMT
Ehatv

Ehatv

Next Story